# # # # # # # # # # # # # # # #

# # # # # # # # # # # # # # # # # # # # # # # # # # #

# # # # # # # # # # # # # # # # # # # # # # # # # # #

Mahesh babu Lady Getup

Mahesh babu in Lady Getup

కథా పరంగా హీరోలు లేడీ గెటప్ లో కనిపిస్తూ కడుపుబ్బా నవ్వించడమనేది బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచి వస్తున్నదే. బాలీవుడ్ ... కోలీవుడ్ ... టాలీవుడ్ ... ఇలా అన్ని భాషలలోని అగ్ర కథానాయకులంతా ఏదో ఓ సందర్భంలో లేడీ గెటప్ లో కనిపించి అభిమానులను అలరించిన వారే. ఇక మన తెలుగు హీరోల విషయానికొస్తే  చిరంజీవి ... బాలకృష్ణ ... వెంకటేష్ ... రాజేంద్ర ప్రసాద్ ... నరేష్  తదితరులు లేడీ గెటప్ లో థియేటర్స్ లో నవ్వుల జల్లు కురిపిస్తూ సందడి చేసినవారే. ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే తరహాలో లేడీ గెటప్ లో సరదాల సందడి చేయబోతున్నారట.
       సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నసినిమాలో సీన్ డిమాండ్ చేయడంతో, తనదైన స్టైల్లో కామెడీని వర్కౌట్ చేసేందుకు మహేష్ బాబు లేడీ గెటప్ కి సిద్ధపడినట్లు తెలుస్తోంది. గతంలో 'బాల చంద్రుడు' సినిమాలో ఓ సన్నివేశంలో అమ్మాయి గెటప్ లో అలరించిన మహేష్ బాబు, హీరోగా లేడీ గెటప్ లో కనిపించడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన 'దూకుడు' ... 'బిజినెస్ మేన్' చిత్రాలలో హీమాన్ లా కనిపించిన మహేష్ బాబు, ఒక్కసారిగా లేడీ గెటప్ లో కనిపించనున్నాడనే విషయాన్ని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ నీయంశమైంది.

Tags: Mahesh Babu In Lady Getup, Mahesh babu sukumar movie latest news, Mahesh babu in Lady getup in Sukumar Movie, Mahesh babu in Lady getup for comedy scenes, Super Star Mahesh Babu as a Female Getup, Mahesh Babu in Lady Getup Latest movie scene, Mahesh babu Sukumar movie, Mahesh Babu in Lady Getup

Leave a Reply